ఈరోజు మీకు నేను లచ్చిం చారు తాయారు చేయడం ఎలాగో చెప్తాను .
లచ్చిం చారు ఎక్కువగా గోదావరి జిల్లాలో, తెలంగాణా లో కొన్ని
ప్రాంతాల్లో ఇది బాగా తెలిసి ఉంటుండి . మన అమ్మమ్మ , నానమ్మల కాలంనాటి
వంటల్లో ఇది ఒకటి . కానీ మనం పాట వంటలకు చాల దూరం అయ్యాము . ఎందుకంటే
మారిన కాలాన్ని బట్టి ఈ పరుగుల ప్రపంచములో సమయము దొరకక వండుకున్నాం, తిన్నాం అన్నట్లుగా ఉంది.
ఇప్పుడు మనం లచ్చిం చారు ఎట్లా తాయారు చేయాలో చూస్తాము .
పట్నం లో కంటే పల్లెలో లచ్చిం చారు తాయారు చేయడం బాగా తెలిసి ఉంటుంది .
ప్రతి ఇంటిలో వంటింట్లో కొత్త మట్టి కుండను పెడతారు. రోజు మనం అన్నం వండేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు పారబోస్తము . అట్లా కాకుండా ఆ నీళ్ళను కొత్త కుండలో భద్రపరచాలి . దేనినే తర్వాణి అని కూడా అంటారు. దీనిలో అన్నం వార్చిన గంజి కూడా అదే కుండలో పోయ్యొచ్చు . ఇది పులిసిన తరువాత చారు తాయారు చేస్తారు .
పులియడంవల్ల ప్రోటీన్ల తో కలసి బలవర్దక ద్రవం తాయారు అవుడుంది .
మనం ఎంత కావాలో అంత తర్వాణి ఒక గిన్నెలో తీసుకోని దానిలో మనకు కావలసినటువంటి కూర ముక్కలు అంటే వంకాయ , టొమాటో, సొరకాయ , దోసకాయ , చిక్కుడు కాయ లాంటివి , ఉల్లిపాయ ముక్కలు తరిగి వేయాలి . దీనిలోనే రెండు పచ్చిమిర్చి కుడా తరిగి వేయాలి. దానిలోనే ఉప్పు , కారం పొడి , పసుపు వేసి మరగ పెట్టాలి .కావలసినవాళ్లు చింతపండు రసం కుడా వేసుకోవచ్చు . బాగా మరిగి , కూర ముక్కలు ఉడికిన తరువాత దించి పోపు పెట్టు కోవాలి. ఈ చారు కట్టెల మంట మీద చేస్తే చాలా బాగుంటుంది . మీకు కావాలనుకుంటే దించిన తరువాత కొంచం చక్కర గాని, బెల్లం గాని వేసుకోవచ్చు .
వేడి వేడి అన్నంలోకి ఈ చారు వేసుకొని వడియాలు నంచుకొంటే అన్నం మొత్తం లచ్చిం చారు తోనే తినవచ్చు.
పల్లెటూర్లలో వారం సంతలో తప్ప కూరలు దొరకవు. అటువంటప్పుడు , అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు ఈ లచ్చిం చారు మానను ఆదుకుంటుంది . ప్రతి ఇంటి లో ఈ కుండ పెడతారు .
ఇప్పుదు పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా లచ్చిం చారు పేరు వినపడుతుంది .
పోషక విలువలు ఉన్నటువంటి ఈ లచ్చిం చారును మీరు కూడా ట్రై చేయండి. పాత వంటల ముందు కొత్త వంటల రుచి పనికిరావు.
నాటు వంటలు అనుకుంటాము కానీ పోషకవిలువలతో కూడిన పాత వంటలు చాలా చాలా రుచిగా ఉంటాయి.
ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా ఎండా కాలం లచ్చిం చారు తాయారు చేస్తారు .
మసాల లాంటివి లేకుండా చాల బాగుంటుంది .
నా ఈ లచ్చిం చారును అందరి సౌకర్యం కోసం ఇంగ్లీష్ లో కూడా నా బ్లాగు లో పెడుతున్నాను.
చూడండి, చేయండి. మీ అభిప్రాయాలను, సలహాలను మాకు తెలపండి.
-- మీ కుసుమ

No comments:
Post a Comment